Saturday, 18 June 2016

13 QUESITION TO MUDARGADA

శ్రీ శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి, ముందుగా మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఇంకా నాదేశం, నా వాళ్ళు ఏ ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నారో చూపినందుకు....కానీ మీ ఆటలు ఎక్కువకాలం సాగవులెండి.. కులాల రొచ్చుతో రాష్ట్రాన్ని కడిగిపారేసారు, ఒక మూర్ఖుడు ప్రాంతీయవాదంతో అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, ఆగాయం ఇంకా పచ్చిపచ్చిగా మనసుల్ని సలుపుతుంటే, మళ్ళీ కులాల కంప తెచ్చి మొత్తం కెలికిపారేసారు. మీ గుండెలపై చెయ్యి వేసుకుని కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి సార్‌... 1. జాతి అంటే ఏంటి కులం అంటే ఏంటి? కాపుకులం, కాపు జాతి ఎలా అయ్యింది? 2. సమస్యలు కేవలం కాపులకే ఉన్నాయా? ఇంకెవరికీ లేవా? 3. మీరు తినే తిండి, కట్టే బట్ట, నడిచే దారి మన కులం వాడు చేస్తేనే వాడుకుందామా ? లేకపోతే పస్తుల్తో చచ్చిపోదామా,నగ్నంగా ఊరేగుదామా, నాజాతి స్మశాన వేదికలో పిశాచాలై నర్తిద్దామా? ప్రస్తుతానికి వస్తే, సరే కాపులకి సమస్యలు ఉన్నాయి ఒప్పుకుందాం(?) మీరు కూడా వారికోసమే పోరాడుతున్నారు(?) 4 . మరి ఆపోరాటం దివంగత వైఎస్‌ఆర్‌ మరియు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏమయింది? 5. ఒకపక్క ప్రభుత్వం స్ధిరపడలేదు. ఉద్యోగులు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ సిగ్గు లేకుండా ఇంకా హైదరాబాదుకి బానిసలై బాన్చన్‌ దొర అనుకుంటూ బతికేస్తున్నారు, హోదాకి గతిలేదు, ప్యాకేజీ పత్తాలేదు, చేతిలో చిల్లుగవ్వలేదు, ఇటువంటి దుర్బరమైన స్ధితిలో వీలైతే సాయంచేయాల్సిందిపోయి ఇలా ఇరుకున పెట్టడం, విద్వేషాలు రగల్చడం, అత్యాచారం చేయడం కంటే ఘోరం, హత్యచేయడం కంటే నేరం, కాదంటారా? 6. లక్షల్లో వచ్చిన వారిని సమన్వయం చేయలేకపోవడం ముమ్మాటికీ మీ చేతకానతనం, కాదంటారా? 7.సభకి వచ్చిన వారిని రెచ్చగట్టడం కుట్రలో భాగం కాదని నిరూపించగలరా? 8. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నేరం కాదంటారా? 9. వాళ్ళని అరెస్ట్‌ చెయ్యకుండా సన్మనాలు చెయ్యాలా? 10. ఆరోజు జరిగిన విధ్వంసంలో ఎవరికైనా ఏమైనా జరిగితే, వారిలో మనవాళ్ళు ఉంటే ఏంటి పరిస్ధితి? మీ ఇంట్లో చిన్న పాప ఏడిస్తేనే కావలసిందేంటో కనుక్కుని అవసరం తీరుస్తారుగా, మరి ఆరోజు చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం బాలేని వారు, ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెట్టి ఉంటారు, వాళ్ళు మనుషులు కారా? అసలు మానవత్వం ఉందా మీకు? దానికి కారణమైన వాళ్ళని వదిలెయ్యమని మళ్ళీ దీక్ష చేస్తునారు, సిగ్గుందా మీకు? 11. నిజమే ఆనాడు జరిగిన విధ్వంసం రాయలసీమ రౌడీల పనే అని ప్రభుత్వం విమర్శించింది, అంతమాత్రాన అసలైనవాళ్ళు దొరికినా వదిలెయ్యమనడం అదేం లాజిక్‌ అసలు? 12. సరే ఉద్యమం చేస్తున్నారు, కానీ సరైన ఉద్యమ కార్యాచరణ ఏది? కార్యాచరణేలేనిదానిని స్వార్ధపూరిత ప్రేరేపణగా ఎందుకు నిర్వచించకూడదు? ఇంట్లో కూర్చుని కంచాన్ని బాదడం కాదు సార్‌, రోడ్డు మీద ఎందరో ఆకలితో మూడిపోతతున్నారు. వాళ్ళు మనుషులు కాదా ? కులాన్ని కాదు వీలైతే వాళ్ళని ఉద్దరించండి,. స్వార్ధంతో యాగం చేసినవాడు శిభి చక్రవర్తి అయినా నేలలోకి తొక్కేసిన ధర్మం సార్‌ మనది. మర్చిపోతే ఎలా? లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ 13. ఎందుకు సార్‌ మమ్మల్ని మనుషుల నుండి జాతి పేరుతో దూరం చేసేశారు? సరే సార్‌ జరిగిందేదో జరిగింది..కానీ రిజర్వేషన్లు ఎందుకు అనవసరంగా, ఏకంగా ప్రత్యేక దేశం అడగండి , హాయిగా ఏ దీవులకో కాపుస్ధాన్‌ అనో కాపు దేశం అనో పేరు పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇంత జరిగాకా వీళ్ళతో కలసి బ్రతకడం కష్టంగా ఉంటుంది. నిన్నటిదాకా కలసి బతికిన స్నేహితుల భుజాలపై చేతులెయ్యాలంటే సిగ్గుగా ఉంది సార్‌, వాళ్ళ కళ్ళల్లోకి చూడాలంటే బెరుకుగా ఉంటుంది. తప్పు చెయ్యకుండానే తలొంచుకునే పరిస్ధితికి వచ్చేసాం సార్‌. ఇంకెందుకు ఇక్కడ, మనదేశం పోదాం, వర్గానికో రాష్ట్రాన్ని చేసి మన పల్లకీల్లో మనమే కూర్చుందా, లాగేవాడితో మనకేంటి పని.. మన దేవుణ్ణి మనమే సృష్టించుకుందాం , వీధికో గుడి వెలుస్తున్న ఈరోజుల్లో దేవుణ్ణి సృష్టించడం ఎంతసేపు రాయి చెక్కితే రూపం, బొట్టుపెట్టి చేతులు జోడిస్తే దేవుడు. ఇహ కాపు గీత రాసే పని కాపునాడుకి అప్పగిద్దాం, కాపు పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు రాసేపనిని సాక్షి వారికి అప్పగిద్దాం,(వారిది మన జాతి(?) కాకున్నా కట్టు కధలు అల్లడంలో వారు దిట్టలు కనుక) అందుకనే దేశాన్ని అడగండి మనం పోదాం, మనం పోతే మిగిలిన వారు మాత్రం ఎందుకుండిపోవాలిక్కడ, అందుకే నా మిగతా జాతి(?) సోదరులారా మీరూ గోంతు పెగల్చండి, తగలబెట్టండి, కులాధారిత దేశ సాధనకి నడుంకట్టండి%లల మనం బతికితే చాలు పక్కోడి బాగు మనకెందుకు, అందుకే ఉద్యమిద్దాం. ''కాదు నాది భారతదేశం, నేను భారతీయున్ని, నాదేశ సమగ్రతే నాకు ముఖ్యం'' అనుకుంటే నిలదయ్యండి ముద్రగడ పద్మనాభం మరిము వెనకుడి చిచ్చు రాజేస్తున్న రాజీకీయ శకునుల్ని... జాతి వైరాలతో, కులం కొట్లాటలతో పబ్బం గడుపుకోవాలనుకునే సన్నాసులకి బుద్ది వచ్చే వరకూ ప్రశ్నంచండి. ఇటువంటి నికృష్టుల చేతిలో రాష్టృం నాశనం కాకుండా కాపాడుకుందాం. మనుషులుగా బ్రతుకుదాం, మానవ సంబంధాలతో బతుకుదాం................................
banner
Previous Post
Next Post

0 comments: